మరికల్, జూన్ 09: మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో స్థానం కల్పించడం పట్ల మరికల్లో (Marikal) కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబురాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఇందిరాగాంధీ చౌరస్తాలో బాణాసంచా కాల్చి మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకుడు సూర్య మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా అభివృద్ధిపథంలో ముందుకెళ్తుందన్నారు. మరికల్ మండల అభివృద్ధికి మంత్రి శ్రీహరి తోడ్పాటు అందిస్తారని పేర్కొన్నారు.
నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి సహకారంతో మరింత అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణయ్య, మండల పార్టీ అధ్యక్షుడు వీరన్న, పట్టణ అధ్యక్షుడు హరీష్ కుమార్, నాయకులు సూర్య ప్రకాష్, పి. రామకృష్ణ, రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ గోపాల్, గుప చెన్నయ్య, గుప నర్సింలు, జంగిడి రవి, జంగిడి ఆంజనేయులు, తిరుమలయ్య, టైసన్, ఆనంద్ కుమార్, గోవర్ధన్, ఎర్గట్ పల్లి తిరుపతయ్య, గొల్ల రాజు, ఆంజనేయ రెడ్డి, నాగరాజు, పెంట మీద రఘు, కుమ్మరి చెన్నప్ప తదితరులు పాల్గొన్నారు.