Collector Sikta Patnaik | సింగారంలో ఓటు వేసిన కలెక్టర్ సిక్తా పట్నాయక్
కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదివారం ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నారాయణ పేట : రెండో విడత ఎన్నికలు జరిగే నారాయణ పేట జిల్లా సింగారం గ్రామ పంచాయతీలో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పదో వార్డు బూత్‌లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదివారం ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సరిగ్గా ఉదయం 8:25 గంటలకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న కలెక్టర్ నేరుగా బూత్ లోకి వెళ్లి ఓటు వేశారు. అనంతరం అక్కడున్న పోలింగ్ సిబ్బందితో మాట్లాడి పోలింగ్ సరళిని పరిశీలించారు.
సింగారం గ్రామ మలుపు దారిలో గల కలెక్టర్ బంగ్లా సింగారం పరిధిలోని కౌరంపల్లి శివారులో ఉండటంతో కలెక్టర్ ఓటు సింగారం గ్రామంలో నమోదైంది. ఈ మేరకు కలెక్టర్ ఆదివారం తన ఓటు హక్కును సింగారం పోలింగ్ కేంద్రంలో వినియోగించుకున్నారు. రెండో విడతలో దామర గిద్ద, నారాయణ పేట, ధన్వాడ, మరికల్ మండలాల పరిధిలోని గ్రామాలలో ఎన్నికల పోలింగ్ జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ నుంచి వెబ్ క్యాస్టింగ్ ద్వారా తాము పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నామని, అంతటా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

