ఊట్కూర్, అక్టోబర్06 : కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యంతోనే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు అన్ని స్థానాల్లో ఘనవిజయం సాధిస్తారని మాజీ జడ్పీటీసీ అరవింద్ కుమార్ అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ అధ్యక్షతన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. మండల కేంద్రంలో మూడు ఎంపీటీసీ జనరల్, రిజర్వుడ్ స్థానాలకు బరిలో నిలిచేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల పేర్లను కార్యకర్తలు బలపరిచారు.
ఈ సందర్భంగా అరవింద్ కుమార్ మాట్లాడుతూ.. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేక పోయిందని విమర్శించారు. ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లిన హామీల కోసం ప్రజలు నిలదీయడమే నిదర్శనంగా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలే రాబోయే స్థానిక ఎన్నికల్లో తమ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధిని, కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రతి గడప గడపకు వెళ్లి వివరించాలన్నారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు.
సమావేశంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, బీఆర్ఎస్ మండల యువజన అధ్యక్షుడు చింతన్ పల్లి ఆనంద్ రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కోరం శివరాజ్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ ఒబెదూర్ రెహమాన్, పార్టీ సీనియర్ నాయకులు వడ్ల మోనప్ప, తరుణ్ రెడ్డి, గంగాధర్ చారి, అభిలాష్ రెడ్డి, హోటల్ ఖాలిక్, ఆర్. అంజి, షేక్ షమీ, షమీవుల్లా ఖాన్, అసిఫ్ బడే పీర్, వడ్డే హనుమంతు, లక్ష్మణ్, నాగేష్ పాల్గొన్నారు.