లక్ష్యం కన్నా అధిక సంపాదన
కరోనా సమయంలోనూ ఆదాయం
నారాయణపేట టౌన్, మార్చి 27 : పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లాభాల బాటలో నడుస్తున్నది. మూడేం డ్లుగా వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే నిర్దేశించిన లక్ష్యం క న్నా అధికంగా సంపాదించింది. కరోనా కారణంగా ఆర్థిక రంగం కుందేలైన సందర్భంలో కూడా వ్యవసాయ మార్కె ట్ లాభాలను ఆర్జీంచడం గొప్ప విషయం.
మార్కెట్ పరిధిలో…
జిల్లాలోని ధన్వాడ, ఊట్కూర్, నారాయణపేట, మరిక ల్, దామరగిద్ద మండలాలు పేట వ్యవసాయ మార్కెట్ పరిధిలోకి వస్తాయి. రైతులు కంది, వరి, వేరుశనగ, జొన్నలు, పెసళ్లు, చింతపండు, తెల్ల కుసుమలు, ఉల్లిగడ్డలు, నల్ల కు సుమలు, అలచందలు, ఆముదాలు, పత్తి తదితర పంట ఉత్పత్తులను తీసుకొచ్చి మార్కెట్ యార్డులో అమ్ముతుంటారు. ఆయా మండలాల్లో రైతులు పండించిన ధాన్యాన్ని పేట వ్యవసాయ మార్కెట్లోకి తీసుకురావడంతో రైతులు తెచ్చిన పంట ఉత్పత్తులతో వ్యవసాయ మార్కెట్ నిత్యం క ళకళలాడుతూ ఉంటుంది. ప్రభుత్వం ప్రాథమిక వ్యవసా య సహకార సంఘాలు, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో వరి కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ వ్యవసాయ మార్కెట్లో ఇతర పంటల క్రయవిక్రయాలు జరగడంతో లాభాలే వచ్చాయి. అదేవిధం గా గతంలో జిల్లాలో ఒకే ఒక పత్తి మి ల్లు ఉండడంతో పత్తి రైతులు ఇబ్బందు లు ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతం 4 పత్తి జిన్నింగ్ మిల్లులు ఉండడంతో పత్తి రైతులు తాము పండించిన పత్తి ఇ క్కడే అమ్మేందుకు అవకాశం ఏర్పడిం ది. పేటకు సరిహద్దున కర్ణాటక రాష్ట్రం ఉండడంతో మన రాష్ర్టానికి సరిహద్దు న ఉన్న గ్రామాల రైతులు కూడా తమ పంట ఉత్పత్తులను పేట మార్కెట్లో అమ్ముతుండడంతో వ్యాపార లావాదేవీలు జోరుగా కొనసాగుతుంటాయి. అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ క మిటీ ఆధ్వర్యంలో మరికల్ మండలకేంద్రంలో తనిఖీ కేంద్రం ఏర్పాటు చేసి 1 శాతం మార్కెట్ ఫీజును వసూలు చేస్తున్నారు.
లక్ష్యానికి మించి…
వ్యవసాయ మార్కెట్లో 2021-22 సంవత్సరానికి గానూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి మించి ఆదాయం సమకూరింది. మూడేండ్ల ఆదాయాలను పరిశీలిస్తే 2019-20లో రూ.కోటి5లక్షల ఆదాయం సమకూర్చాలని లక్ష్యం గా నిర్దేశించుకోగా రూ.కోటి23లక్షల ఆదాయంతో 117శాతానికి చేరింది. 2020-21కిగానూ రూ.కోటి59లక్షల ఆ దాయం సమకూర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా రూ. కో టి97లక్షల ఆదాయంతో 123శాతానికి చేరింది. అదేవిధం గా 2021-22కుగానూ రూ. 2కోట్ల28లక్షల ఆదాయం స మకూర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఫిబ్రవరి చివరి నా టికి రూ.3కోట్ల4లక్షల ఆదాయంతో 133 శాతానికి చేరిన ట్లు వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులు తెలుపుతున్నా రు. మార్చి చివరి నాటికి మరింత ఆదాయం వస్తుందని చె బుతున్నారు.
మద్దతు ధర వచ్చేలా చర్యలు
మార్కెట్లో రైతులు విక్రయించిన పంట ఉత్పత్తులకు మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ మంచి ధరలు ఉండండతో కర్ణాటక రాష్ర్టానికి చెందిన వివిధ గ్రామాల రైతులు పంట ఉత్పత్తులు ఇక్కడికి తెచ్చి అమ్మేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వరి, కంది పంట ఉత్పత్తులను ఇక్కడకు తెచ్చి అమ్ముతుంటారు. సీజన్ సమయంలో రైతులు ఎక్కువ మొత్తంలో ధాన్యం తీసుకువస్తే వారికి ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు చేపడుతున్నాం. – చంద్రశేఖర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి
అన్ని వసతులు కల్పిస్తున్నాం
పండించిన పంటలను మార్కెట్లో విక్రయించేందుకు వచ్చిన రైతులకు అన్ని వసతులు కల్పిస్తున్నాం. తాగేందుకు మినరల్ వాటర్ ఏర్పాటు చేశాం. ధాన్యం ఉంచేందుకు అందుబాటులో 4 షెడ్లు ఉన్నాయి. ఖరీదుదారులు ఆన్లైన్ టెండర్ ప్రక్రియ ద్వారా ధరలు నిర్ణయించడంతో రైతులకు మంచి మద్దతు ధరలు లభిస్తున్నాయి. ఈ నామ్ అమలు చేయడంలో వ్యవసాయ మార్కెట్ ఉమ్మడి జిల్లాలోనే మొదటి స్థానంలో ఉంది.
– భాస్కర్కుమారి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్