లింగాల ,ఏప్రిల్ 7: మండలంలోని ఆవుసలికుంట గ్రామంలో గత వారం రోజులుగా తాగునీటి ఎద్దడి నెలకొంది. గ్రామంలో ఉన్న రెండు ట్యాంకులలో ఒక ట్యాంకు మాత్రమే మిషన్ భగీరథ నీళ్లు సరఫరా అవుతున్నాయి. మరో ట్యాంకును బోర్ వాటర్‌తో నింపుతున్నారు. కాగా గ్రామంలోని 6 నుంచి 10 వార్డులలో మాత్రం బోరుతో నింపుతున్నప్పటికి బోరు మోటర్ వారం పది రోజులకు ఒకసారి కాలిపోతున్నది.
దీంతో ఆయా వార్డులలో తాగునీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. వేసవిలో తాగునీరు లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని ప్రజల ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి ఎద్దడిని నివారించాలని ప్రజలు కోరుతున్నారు.