బిజినేపల్లి, జూన్ 23: బిజినేపల్లి మండలంలోని (Bijinapally) పాలెంలో తోటపల్లి సుబ్రహ్మణ్య శర్మ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నో ఆవిష్కరణలు చేసి చిన్నపాటి గ్రామాన్ని పెద్ద పట్టణంగా తీర్చిదిద్దిన ఘనత సుబ్బయ్యకే దక్కుతుందన్నారు. గ్రామంలో గుడి, బడి, కళాశాల, పరిశోధన కేంద్రం, పరిశ్రమలు, హాస్పిటల్ వంటి ఎన్నో మౌలిక వసతులను నెలకొల్పారని చెప్పారు. విద్యా నిలయంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. విద్యార్థులు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు, సురేందర్, రామయ్య, బాలస్వామి, గోపాల స్వామి, జగన్, మధు, ఆనంద్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, శీను, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.