YS Jagan | గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న ప్రవాస ఆంధ్రులను సురక్షితంగా తీసుకురావాలి: వైఎస్ జగన్
YS Jagan | మధ్య పాశ్చ్య దేశాల్లో నెలకొన్న యుద్ద వాతావరణం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ప్రవాస ఆంధ్రులను సురక్షితంగా తీసుకురావాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
అమరావతి : మధ్య పాశ్చ్య దేశాల్లో ( Middle East Countrys ) నెలకొన్న యుద్ద వాతావరణం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ప్రవాస ఆంధ్రులను సురక్షితంగా తీసుకురావాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ( YS Jagan ) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వేలాది మంది గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్నారని, ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితుల్లో అక్కడ అనిశ్చితి నెలకొనడంతో పాటు, భద్రత కొరవడిందన్నారు. మరోవైపు పలు విమానాశ్రయాల్లో ఆంక్షలు, విమాన సర్వీసుల రద్దు వల్ల చాలా మంది ఎక్కడకిక్కడ చిక్కుకుపోయి, అనేక ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు.
రాష్ట్రానికి చెందిన వారందరినీ సురక్షితంగా ఇక్కడికి తీసుకురావడంలో ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఈ విషయంలో కేంద్రంతో సమన్వయం చేసుకుని, ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా వారందరినీ తరలించాలని కోరారు. ఇంకా గల్ఫ్ దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలతో కూడా సమన్వయం చేసుకుని, ప్రవాస ఆంధ్రుల పరిరక్షణకు చర్య తీసుకోవాలని కోరారు.
అక్కడున్న వారి పరిస్థితిని ఎప్పడికప్పుడు, వారి కుటుంబాలకు తెలియజేసే విధంగా ఏపీలో ప్రత్యేక కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసి, హెల్ప్‌లైన్ నెంబర్లు కూడా అందుబాటులోకి తేవాలని సూచించారు. ప్రవాసాంధ్రుల భద్రత, వారి సురక్షిత ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని, ఈ సంక్షోభ సమయంలో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం పని చేయాలని సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

