MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
MLA Anirudh Reddy | జడ్చర్ల నియోజకవర్గంలో 30 వేల మందితో దీక్షలకు కూర్చుంటా. చచ్చిపోయేంత వరకు కూర్చుంటా.. అంటూ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Anirudh Reddy | కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికప్పుడు ధిక్కార స్వరం వినిపించే సొంత పార్టీ ఎమ్మెల్యేలు చాలా మందే ఉన్నారని తెలిసిందే. ఎప్పుడూ ప్రభుత్వంపై తనదైన శైలిలో కౌంటర్లు వేసే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నిధుల విడుదలలో జాప్యం విషయంలో సర్కార్‌పై తనదైన శైలిలో చురకలంటించి రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు తెరలేపుతున్నారు.
స్థానికంగా జరిగిన ఓ సమావేశంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. జడ్చర్ల నియోజకవర్గంలో 30 వేల మందితో దీక్షలకు కూర్చుంటా. చచ్చిపోయేంత వరకు కూర్చుంటా.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిధులియ్యాల్సిందే. రోడ్లు కంప్లీట్ చేయాల్సిందే. మనకు రోడ్లు ఇచ్చింది ఎవరు..? నా గురువు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఆయననే అడుగుతున్నా.. అన్నా కొబ్బరికాయకొట్టి పోయినవ్ అని ప్రశ్నించారు.
మళ్లీ భట్టి విక్రమార్క పాదయాత్రకు వస్తే జడ్చర్లలో 30-40 వేల మందితో ఆ రోజు నేను సభ చేసిన. భట్టి విక్రమార్కను కూడా అడుతుగున్నా.. నా నియోజకవర్గంలో కొందరిలా మీరు బిల్లులు ఇయ్యండి.. లేకుంటే నేను ఆమరణ నిరాహాక దీక్షకు కూర్చుని.. ఇక చచ్చిపోనన్నా చనిపోతా కానీ నిధులు మాత్రం జడ్చర్లకు ఇయ్యాల్సిందే.. ఒకవేళ అనిరుధ్ రెడ్డి చచ్చిపోతెనే జడ్చర్లకు నీళ్లు ఇస్తామంటే.. నేను అమరణ నిరాహార దీక్షలో నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి.. ఓ నాగర్‌కర్నూల్ ఆర్అండ్ బీ కాంట్రాక్టర్ చచ్చిపోతే కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి రూ.40 కోట్లు విలువనా..? లేదా నా ప్రాణం విలువనా..? అనేది మా ప్రభుత్వం నిర్ణయించుకోవాలని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హితవు పలికారు. కాంగ్రెస్‌లో సొంత పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉందో అనిరుధ్ రెడ్డి కామెంట్స్ క్లారిటీ ఇచ్చేస్తున్నాయి.
నేను చనిపోతా అంటేనే బిల్లులు వస్తాయంటే చావడానికి అయినా సిద్ధం
నా చావుకి 40 కోట్లు విలువనా లేదా నేను బతికి ఉండాలా అనేది ప్రభుత్వం నిర్ణయించాలి
నా నియోజకవర్గంలో రోడ్లు పూర్తి చేయకుంటే 30 వేల మందితో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతా
భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రోడ్ల నిర్మాణానికి బిల్లులు మంజూరు చేస్తామని అన్నారు
నా చావుతోనే స్పందిస్తారా?
రూ.40 కోట్లు విలువనా లేదా నా ప్రాణం విలువనా అనేది మా ప్రభుత్వం నిర్ణయించుకోవాలి
– జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
— Telugu Scribe (@TeluguScribe) October 26, 2026
Read Also :
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

