వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
మహబూబ్‌నగర్, అక్టోబర్ 26 : వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వాల్మీకి రామాయణం రచించి విలువలను చాటి చెప్పినారన్నారు. మార్పు మనిషి జీవితాన్ని మహోన్నతంగా మారుస్తుంది అని నిరూపించిన మహర్షి వాల్మీకి జీవితం మనందరికి ఆదర్శమని పేర్కొన్నారు. మనిషిని గొప్పవాడిని చేసేది అతని పుట్టుక కాదు, అతని ఆలోచనలు, ఆచరణ, వ్యక్తిత్వం అనడానికి ఆదికవి వాల్మీకి జీవితమే నిదర్శనం అని తెలిపారు.
వాల్మీకి సామాజిక వర్గం అభివృద్ధికి కె.సి.ఆర్ ప్రభుత్వం విశేష కృషి చేసిందన్నారు. చెల్లప్ప కమిషన్ ఏర్పాటు చేసి ఎస్.టి జాబితాలో చేర్చడానికి సిఫార్సు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పలుస రమేష్ గౌడ్, గంధం పరంజ్యోతి, కె. మాణిక్యం, ఉంగ్లం తిరుమల్, వేణు గోపాల్, దేవర్ల నరసింహ, నీలస్వామి, పెద్దముక్కల రవి, చిట్యాల రాము పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

