Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
Dhanush | తమిళనాడు రాజకీయాలకు, సినీ రంగానికి విడదీయలేని అనుబంధం ఉంది. వెండితెరపై స్టార్డమ్ సంపాదించుకున్న పలువురు నటులు రాజకీయాల్లోనూ తమదైన ముద్ర వేశారు. తాజాగా నటుడు విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి తన పార్టీతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో.. మరో కోలీవుడ్ స్టార్ ధనుష్ కూడా అదే బాటలో పయనించబోతున్నారా? అనే చర్చ మొదలైంది.
Dhanush | తమిళనాడు రాజకీయాలకు, సినీ రంగానికి విడదీయలేని అనుబంధం ఉంది. వెండితెరపై స్టార్డమ్ సంపాదించుకున్న పలువురు నటులు రాజకీయాల్లోనూ తమదైన ముద్ర వేశారు. తాజాగా నటుడు విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి తన పార్టీతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో.. మరో కోలీవుడ్ స్టార్ ధనుష్ కూడా అదే బాటలో పయనించబోతున్నారా? అనే చర్చ మొదలైంది. గత కొంతకాలంగా ధనుష్ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు వినిపిస్తుండగా, ఆయన అభిమాన సంఘాలతో నిర్వహిస్తున్న సమావేశాలు ఈ చర్చకు మరింత ఊతమిస్తున్నాయి. ధనుష్ సినిమాలతో బిజీగా ఉంటూనే అభిమాన సంఘాల ప్రతినిధులతో వరుసగా సమావేశమవుతున్నారనే వార్తలు కోలీవుడ్‌లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో చర్చలు జరిపినట్లు ప్రచారం జరగగా, తాజాగా చెన్నైలో మహిళా అభిమాన సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.
చోళింగనల్లూరులోని జేబీఆర్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి 58 జిల్లాల నుంచి 2,500 మందికి పైగా మహిళా అభిమానులు హాజరైనట్లు తెలుస్తోంది. భారీ సంఖ్యలో అభిమానులను ఒకచోట చేర్చడం, జిల్లాలవారీగా అభిమాన సంఘాలను చురుగ్గా మార్చడం వంటి పరిణామాలతో ధనుష్ రాజకీయ ప్రవేశానికి ఇప్పటి నుంచే పునాది వేస్తున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సమావేశాల వెనుక రాజకీయ లక్ష్యం ఉందని ధనుష్ అధికారికంగా ప్రకటించలేదు. 2031 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ధనుష్ ఐదేళ్ల ముందుగానే రాజకీయ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అభిమాన సంఘాలు సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నాయన్న వార్తలు ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నాయి.
ధనుష్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం నేపథ్యంలో టీవీకే నేతల వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ధనుష్ రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తామని చెబుతూనే, విజయ్‌లా తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి కావడం అంత సులభం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. టీవీకే నేత అధవ్ అర్జున్ చేసినట్లు ప్రచారంలో ఉన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. డీఎంకేను ఉద్దేశించి ‘సైతాన్లు పోయారు.. ఇప్పుడు పిల్ల సైతాన్లు వస్తున్నారు’ అంటూ ఆయన సెటైర్లు వేసారు. ఈ వ్యాఖ్యలు ధనుష్ రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న చర్చకు మరింత ఆసక్తిని జోడించాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- dhanush
- politics
- rajinikanth
- vijay
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

