వెల్దండ, ఏప్రిల్ 26: ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ (BRS) రజతోత్సవ సభకు మేము సైతం అంటూ గ్రామాల్లో ప్రజలు ముందుకు వస్తున్నారు. సామాన్యులు సైతం బీఆర్ఎస్ సభ పోస్టర్లను అతికించడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. శనివారం ఉదయం నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బైరాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోటపల్లి వెంకటేశ్ ఆధ్వర్యంలో పోస్టర్లు అతికించడం జరిగింది. జై తెలంగాణ, జై జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి వాడవాడ తిరుతూ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. కేసీఆర్‌తోనే సుభిక్ష పాలన సాధ్యమని తెల్చి చెపుతున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి కాంగ్రెస్ పార్టీ గట్టి బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.
మండలంలోని పోతేపల్లిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ పోస్టర్లను పార్టీ మండల నాయకుడు కొండల్ కొండల్ యాదవ్ విడుదల చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ 27న వరంగల్‌లో జరిగే సభలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీకి విశేష స్పందన ఉందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల నాయకుడు జంగిలి ఆనంద్, అశోక్, రవి ,శ్రీను, వెంకటేష్ , నారమ్మ తదితరులు పాల్గొన్నారు.