బిజినేపల్లి మార్చ్ 28 : కారు బోల్తాపడి ఒకరు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన బిజినేపల్లి మండలం పాలెం గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న నజీర్ (44)రంజాన్ పండుగ కోసం హైదరాబాద్ నుండి నాగర్ కర్నూల్‌కు తన భార్య పిల్లలతో కలిసి మారుతి కారులో వెళ్తున్నారు.
ఈ క్రమంలో పాలెం గ్రామ సమీపం వద్ద కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో నజీర్ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో గమనించిన స్థానికులు 108 కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది నాగర్‌కర్నూల్ హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కారులో ఉన్న మృతుని భార్యతో పాటు ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.