మాగనూరు ఏప్రిల్ 10: మాగనూరు మండల పరిధిలోని వడ్వాట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలను ఎంపీడీవో రహమతుద్దీన్ గురువారం ఆకస్మికంగా తనఖీ చేశారు. పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. తాజా కూరగాయలతో మాత్రమే వాడాలని వంటలు చేయాలన్నారు. వంట సామగ్రిని కూడా పరిశుభ్రంగా కడిగి తర్వాతే మధ్యాహ్న భోజనం వండాలని సూచించారు. వంటగదిని కూడా పరిశుభ్రతగా ఉంచుకోవాలన్నారు.
అలాగే పాఠశాల రికార్డులను పరిశీలించారు. అనంతరం వడ్వాట్ గ్రామపంచాయతీ నర్సరీ కమ్యూనిటీ ప్లాంటేషన్‌ను తనిఖీ చేశారు. కమ్యూనిటీ ప్లాంటేషన్ కి ప్రతిరోజు టాంకర్ ద్వారా మొక్కలకు సరిపోయేలా నీళ్లు పోయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గురురాజరావు, నర్సింలు, భీమ్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శు రవికుమార్ పాల్గొన్నారు.