ఆత్మకూర్,మార్చి 28 : వివిధ కారణాలతో మరణించిన బాధిత కుటుంబాలను మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పరామర్శించారు. ఆత్మకూర్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకుడు పుట్నాల రమేష్ మాతృమూర్తి పుట్నాల సావిత్రమ్మ బుధవారం మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. పిన్నెంచెర్ల గ్రామంలో రోడ్డు ప్రమాదం బారిన పడి కోలుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు కురువ అంజప్పను పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ ఈ సంవత్సరం వేసవికి ముందే ఎండలు విపరీతంగా ఉన్నాయని ప్రజలు ఎండలపట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.
నిర్లక్ష్యం చేస్తే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉంటామ న్నారు. అనంతరం గోపాల్పేట గ్రామంలో జరుగుతున్న బండలయ్య ఉర్సు ఉత్సవాల సందర్భంగా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రహమతుల్లా, మండల అధ్యక్షుడు పరమేష్, ఆత్మకూర్ టౌన్ అధ్యక్షులు నల్లగొండ శ్రీనివాసులు, ఆత్మకూరు మాజీ సర్పంచ్ గంగాధర్ గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు తులసిరాజు యాదవ్ తదితరులు ఉన్నారు.