బిజినపల్లి,ఏప్రిల్ 16 : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వమే ప్రతి గింజలు కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా బిజినాపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సకాలంలో ధాన్యం కొంటున్నామని తెలిపారు.
సన్నరకం వడ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. రైతులు ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. అదేవిధంగా గురుకుల పాఠశాలకు తమ ఫౌండేషన్ ద్వారా 10 గ్రీన్ బోర్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాములు, తిరుపతయ్య, వెంకటస్వామి, గోవిందు, చంద్ర గౌడ్, రాజు, రాము, వెంకటేష్ గౌడ్, శంకర్, రామ్ చందర్ నాయక్, పాషా, ముక్తార్, సత్యం, యువకులు, తదితరులు పాల్గొన్నారు.