తిమ్మాజిపేట,జూన్ 11 : రేపటి నుంచి ప్రారంభం కానున్న పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతగా అందించాలని తిమ్మాజీపేట ఎంఈఓ సత్యనారాయణ శెట్టి సూచించారు. బుధవారం మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం లకు, మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని ఎలా తయారి విధానం, విద్యార్థులకు నాణ్యతగా ఎలా అందించాలో ఆర్పీ నిరంజన్ వివరించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ఇప్పటికే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా వంట పాత్రలను అందజేశామని, వాటి ద్వారా పరిశుభ్రంగా భోజనాన్ని అందించాలన్నారు. భోజనంలో నాణ్యతతో పాటు విద్యార్థులకు, అవసరమైన ప్రోటీన్లను అందించాలన్నారు. ఇందుకోసం పౌష్టికరమైన ఆహారాన్ని తయారు చేయాలన్నారు. ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనాన్ని సిద్ధం చేసి అందించాలని, వంటశాలలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు, హెచ్ఎంలు పాల్గొన్నారు.