వెల్దండ మే 13 : నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం బైరాపూర్ గ్రామంలో గత నాలుగు రోజులుగా స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున స్వామివారి పెద్ద రథోత్సవం కార్యక్రమం వైభవంగా సాగింది. ఈ సందర్భంగా భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారి పెద్ద రథాన్ని లాగారు. గోవింద నామస్మరణతో బైరాపూర్ గ్రామం మార్మోగింది.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. రథోత్సవ వేడుకల్లో ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా వెల్దండ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు జగన్మోహన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రమేష్ గౌడ్, మాజీ సర్పంచ్ యాదయ్య, బిజెపి నాయకులు శేఖర్ రెడ్డి, జూలూరు బాలస్వామి, జంగయ్య యాదవ్, మోహన్ రెడ్డి, శ్రీనివాస చారి, శ్రీశైలం యాదవ్, శ్రీనివాస్ ఆలయ అర్చకులు నరహరి శర్మ తదితరులు ఉన్నారు.