మక్తల్ జూన్ 04 : ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా(టీయూసీఐ) జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని టీయూసీఐ నారాయణపేట జిల్లా అధ్యక్షులు కిరణ్ అన్నారు. బుధవారం మక్తల్ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మహాసభల కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన కిరణ్ మాట్లాడుతూ.. నారాయణపేట జిల్లా కేంద్రంలో జూన్ 15 ,16 తేదీలలో జరిగే ప్రథమ మహాసభలు నిర్వహిస్తామన్నారు. ఈ మహాసభలకు గ్రామపంచాయతీ, మిషన్ భగీరథ, ఆటో, రైస్ మిల్, అంగన్వాడీ ఆశ, మధ్యాహ్న భోజనం ఆటో వర్కర్స్, మిషన్ భగీరథ, మధ్యాహ్న భోజన కార్మికులు, భవన, ఇతర నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్మికులను కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలనీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలనీ డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు కారు చౌకగా అమ్ముతు న్నారని, కార్మిక హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. కార్మిక హక్కుల దక్కాలంటే పోరాడాలని పిలిపునిచ్చారు. కార్యక్రమంలో కొలిమి రాములు, జి కృష్ణయ్య, బండారి మల్లేష్, నరేందర్, నరసింహ, బండారు రవి, తాయప్ప
తదితరులు పాల్గొన్నారు.