కొల్లాపూర్ : ప్రతి వ్యక్తి ఆర్థిక వృద్ధిలో బ్యాంకుల సహకారం తోడ్పాటు ఎంతగానో అవసరం ఉంటుందని రత్నగిరి ఫౌండేషన్ డైరెక్టర్ జూపల్లి అరుణ్ బాబు అన్నారు. గురువారం కొల్లాపూర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటుచేసిన కెనరా బ్యాంక్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కెనరా బ్యాంక్ లోని పలు సేవలను డీజీఎం రంగారెడ్డి సర్కిల్ హెడ్ వైసీహెచ్ వెంకటేశ్వర రెడ్డి, బ్రాంచ్ మేనేజర్ రవీంద్రారెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు.
ఒకప్పుడు కొల్లాపూర్ కోన్ పూస్తా కొల్లాపూర్గా నానుడి ఉండేదని ప్రస్తుతం కొల్లాపూర్ పట్టణంలోనే బ్యాంకింగ్ రంగ సేవలు మెరుగయ్యాయన్నారు. కెనరా బ్యాంక్ దేశంలోని అన్ని రాష్ట్రాలలో గ్రామీణ స్థాయి వరకు బ్యాంకింగ్ సేవలను అందిస్తుందన్నారు. కొల్లాపూర్ ప్రాంతంలోని రైతులకు ప్రజలకు వ్యాపారస్తులకు నాణ్యమైన మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించాలని బ్యాంక్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, రైతులు, వ్యాపారస్తులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.