Dureddy Raghuvardhan Reddy | కొల్లాపూర్, మార్చి 20: ఉమ్మడి రాష్ట్రానికి స్వరాష్ట్రమైన తెలంగాణకు తాగునీరు, సాగునీరు అందించేందుకు చీకటి నుంచి విద్యుత్ కాంతులను నింపేందుకు సర్వస్వం త్యాగం చేసిన కొల్లాపూర్‌కు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ నేత దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి అన్నారు. సమైక్య పాలనలో స్వపాలకులు కొల్లాపూర్ అభివృద్ధి కాకుండా అడ్డుకుంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొల్లాపూర్ కొంతమేరకు వెలుగులోకి వచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తన బడ్జెట్‌తో కొల్లాపూర్‌ను మళ్లీ చీకటిలోకి నెట్టి వేస్తుందన్నారు.
కొల్లాపూర్ ప్రాంతంలోని చిన్నంబావి, పెంట్లవెల్లి కొల్లాపూర్ మండలాల పరిధిలోని మినీ లిఫ్టులు, వీపనగండ్ల, పానగల్ మండలాల పరిధిలోని గ్రామాలకు సాగునీటి వసతులు ఏర్పాటుకు బడ్జెట్లో నిధులు లేకపోవడం అంటే కాంగ్రెస్ కొల్లాపూర్ మోసం చేసిందని చెప్పవచ్చన్నారు.
ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినా..
ఎన్నోసార్లు కొల్లాపూర్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ మాత్రం కొల్లాపూర్ ప్రజలను మోసం చేస్తూ వస్తుంది. మినీ లిఫ్టులతో కొల్లాపూర్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయవచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్నంబావి మండల పరిధిలోని మినీ లిఫ్ట్ లను పెంట్లవెల్లి కొల్లాపూర్ మండలాల పరిధిలోని మినీ లిఫ్ట్ లకు నిధులను కేటాయించి వినియోగంలోకి తెచ్చేందుకు కృషి చేసింది. అత్యధిక కాలం కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా మంత్రిగా పదవులు అనుభవించి మినీ లిఫ్టుల గురించి పట్టించుకోలేదు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే మిషన్ భగీరథ ఎంజికేఎల్ఐ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేసి కొల్లాపూర్‌తో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు తాగునీరు అందించడం జరిగింది. కానీ ఈ బడ్జెట్లో పిఆర్‌ఎల్‌ఐకి రూ.1,714.00, యంజీకేఎల్ఐకి రూ.800.00 కోట్లు కేటాయించింది. చివరి ఆయకట్టుకు సాగునీరు అందించకుండా మధ్యలోనే నిధులు లేక పనులు ఆగిపోయే విధంగా బడ్జెట్ ఉందన్నారు.
సింగోటం రిజర్వాయర్ నుంచి గోపాల్దిన్నె లింకు కెనాల్ జిల్దారు తిప్ప చెరువుకు శ్రీశైలం నీళ్లను నింపేందుకు మినీ లిఫ్టులు మల్లేశ్వరం, మంచాలకట్ట చిన్నంబావి మండల పరిధిలోని మినీ లిఫ్టులకు బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించలేదో ప్రభుత్వ సమాధానము చెప్పాలని డిమాండ్ చేశారు.
Vishnupriya | బెట్టింగ్ యాప్ కేసు.. విష్ణుప్రియ ఫోన్‌ని సీజ్ చేసిన పంజాగుట్ట పోలీసులు