బిజినేపల్లి, ఏప్రిల్ 1 : హెచ్సీయూ భూముల అమ్మకం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉప సంహరించుకోవాలని సీపీఐ నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల సహాయ కార్యదర్శి భూపేశ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు. ఏఐఎస్ఎఫ్ ఎటువంటి కార్యక్రమాలకు పిలుపు నివ్వకపోయినా అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. హెచ్సీయూ విద్యార్థులపై ప్రభుత్వం, పోలీసులు దాడి చేసి ఇష్టానుసారంగా అక్రమ అరెస్ట్ చేయడం సిగ్గుచేటు అన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. 15 నెలలు గడుస్తున్నా రాష్ట్రంలో విద్యాశాఖకు ఇంక మంత్రి లేకపోవడం సిగ్గుచేటు అన్నారు.