బిజినేపల్లి, జూన్ 8: మంత్రివర్గ విస్తరణలో భాగంగా గిరిజన మహిళకు స్థానం కల్పించాలంటూ రాష్ట్ర గిరిజన విద్యార్థి సమితి, లంబాడ హక్కుల పోరాట సమితి గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో ముట్టడికి వెళ్లకుండా స్థానిక గిరిజన నాయకులను బిజినేపల్లి (Bijinapally) పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరన్నారు. గిరిజన మహిళకు మంత్రి పదవి కేటాయించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా ఎస్టీ మహిళకు మంత్రి పదవి ఇచ్చేదాకా ఉద్యమం ఆగదన్నారు. కార్యక్రమంలో జీవీఎస్ జిల్లా కన్వీనర్ రాత్లావత్, తిరుపతి నాయక్, బిజినేపల్లి మండల ప్రధాన కార్యదర్శి ఇస్లావత్, నితిన్ నాయక్ తదితరులు ఉన్నారు.