Ration Dealers | వెల్దండ, జూన్ 27 : ప్రతి నెల రేషన్ బియ్యం ఇచ్చే క్రమంలో డీలర్లు, వారి కుటుంబ సభ్యులు అనారోగ్యం బారిన పడుతున్నారని, అనారోగ్యం కారణాలతో మృతి చెందిన రేషన్ డీలర్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వెల్దండ మండల అధ్యక్షుడు జంగయ్య కోరారు.
ఇటీవల వెల్దండ మండలం పోచమ్మ గడ్డ తాండ రేషన్ డీలర్ గమ్లి భర్త తావూర్యా నాయక్ అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో శుక్రవారం రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి, రూ.10 వేలు ఆర్థిక సాయాన్ని రేషన్ డీలర్ గమ్లికి అందజేశారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.
రేషన్ డీలర్ గమ్లి భర్త తావూర్యా నాయక్ మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు నరసింహ, బాలరాజు, చంద్రశేఖర్, వెంకటయ్య, జగదీశ్వర్, ఆర్కే గౌడ్, మల్లేష్, గణపతి, శ్రీనివాసులు, గోపాల్, తదితరులున్నారు.
Transformer | ట్రాన్స్ఫార్మర్ పెట్టారు.. కానీ కనెక్షన్ మాత్రం మరిచారు.. ముళ్ల పొదల్లో ఇలా