బిజినేపల్లి,జూన్2 : పార్టీ కోసం పని చేసే వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. సోమవారం బిజినపల్లి మండలంలోని పాలెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త శ్రీనివాసులు గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పొందడంతో పార్టీ ప్రమాద బీమా పథకం కింద 2 లక్షల రూపాయల చెక్కును మంజూరు చేపించి కుటుంబీకులకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..గ్రామా స్థాయి నుంచి పార్టీని పటిష్టపర్చడంలో కార్యకర్తల పాత్ర క్రియాశీలకమైందన్నారు.
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. ప్రతి కార్యకర్తకు అండగా పార్టీ ఎల్లప్పుడూ ఉంటుంది అని హామీనిచ్చారు. సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త పని చేయాలనీ సూచించారు.18 నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను గ్రామాల్లో ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, ఖదీర్, తిరుపతిరెడ్డి, వెంకటయ్య, చంద్రారెడ్డి, జగదీష్, గఫూర్, స్వామి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.