పెద్ద మందడి : క్రీడల వల్ల స్నేహభావం, ఐక్యత పెరుగుతాయని, అలాగే క్రీడలలో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా పెద్ద మందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో ఉగాది, రంజాన్ పండుగల సందర్బంగా పామిరెడ్డి పల్లి ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను మాజీ మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాల వల్ల యువత మధ్య ఐక్యత పెరుగుతుందని, మానసిక ఉల్లాసంతోపాటు శారీరక దృఢత్వం పెరుగుతుందన్నారు. మొదటి బహుమతి 20 వేలు రూపాయల నగదును మాజీ మంత్రి ప్రకటించారు. అలాగే ద్వితీయ బహుమతి 10 వేలు, తృతీయ బహుమతి 5 వేలు నగదును మాజీ ఎంపీపీ ఎమ్ మన్నెపురెడ్డి ప్రకటించారు.
మాజీ మంత్రి వెంట పామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీపీ మన్నెపు రెడ్డి, రవిచందర్ రావు, గోవర్ధన్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, నాగేందర్ రావు, మాజీ ఎంపీటీసీ వడ్డే వెంకటయ్య, కావలి వెంకటరాములు, క్రీడాకారులు, కార్యకర్తలు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.