బిజినేపల్లి : ప్రజాపాలనలో రైతులకు పెద్దపీట వేయడం జరిగిందని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. బుధవారం బిజినేపల్లి మండల కేంద్రంలో పీఏసీఎస్ (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సకాలంలో ధాన్యం కొంటున్నామని తెలిపారు.
సన్నరకం వడ్లకు క్వింటల్‌కు 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. రైతులు ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. మొత్తం 13 కేంద్రాల ద్వారా వడ్లను కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోనే ఈ మండలంలో ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు.
19 వేల ఎకరాలు ఈ మండలంలో వరిని సాగుచేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీరాములు, ఎంపీడీవో కథలప్ప, ఏవో నీతి, రవి, సింగిల్ విండో చైర్మన్ బాలరాజ్ గౌడ్, రాములు, నసీర్, తిరుపతయ్య, మధుసూదన్ రెడ్డి, రామచందర్, పర్వతాలు, వెంకటస్వామి, వెంకటేష్ గౌడ్, కృష్ణారెడ్డి, పరశురాములు, ముక్తార్, సత్యం, పాషా, సైదులు పాల్గొన్నారు.