Urea | బిజినేపల్లి జనవరి 24: కాంగ్రెస్ పాలనలో యూరియా దొరకగా రైతులు ప్రతినిత్యం నరకయాతన పడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని సింగల్ విండో కార్యాలయం రైతు వేదికల వద్ద శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజామున వరకు రైతులు యూరియా బస్తాల కోసం నిరీక్షించారు. మండలంలోని ఆయా గ్రామాల నుంచి యూరియా కోసం పెద్ద ఎత్తున మండల కేంద్రానికి చేరుకుని ఎముకలు కొరికే చలిలో స్వెటర్లు దుప్పట్లను వేసుకొని క్యూ లైన్లో పడిగాపులు కాశారు.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందిస్తున్నామని గొప్పలు చెబుతున్నారే తప్ప అమలు చేయడం లేదని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు అధికార యంత్రాంగం ప్రతినిత్యం జిల్లాలో యూరియా విరివిగా ఉందని ప్రకటనలు చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు ఏమాత్రం అందడం లేదని అంటున్నారు. రెండు మూడు బస్తాల కోసం రోజుల తడబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వాటికి కూడా ఎన్నో రకాల నిబంధనలతో ఇవ్వడం జరుగుతుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో యూరియా కోసం ఇబ్బందులు పడలేదని గుర్తుచేస్తున్నారు.

Bijinepalli