Mission Bhagiratha | కొల్లాపూర్, ఫిబ్రవరి 19 : బోడబండ తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్రగట్టు బొల్లారంలో ఉన్న త్రాగునీటి సమస్య పరిష్కారం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ మేరకు వారంతా కలిసి మిషన్ భగీరథ ఏఈకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘ జిల్లా అధ్యక్షులు ఎస్ అశోక్ మాట్లాడుతూ.. ఎర్రగట్టు బొల్లారంలో గత పది రోజుల నుంచి త్రాగునీటి సమస్యను గ్రామస్తులు తీవ్రంగా ఎదుర్కొంటున్నారన్నారు.
గతంలో అంజన్న గిరి మీదుగా భగీరథ పైప్ లైన్ ఉండేది. ఇప్పుడు నార్లాపూర్ ముక్కుడిగుండం మీదుగా పైప్ లైన్ ఉండడం వల్ల గ్రామానికి మంచినీళ్లు రావట్లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాబట్టి ఇంతకుముందు ఇచ్చినట్టుగా పైప్ లైన్లు బోడబండ తండా అంజనగిరి మీదుగా ఇవ్వాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు.
భగీరథ వాటర్ ట్యాంక్ నీటి నల్లాలు వృథాగా ఉన్నందువల్ల ఎలాంటి ఉపయోగం లేదని.. బోడబండ తండా అంజనగిరి మీదుగా పైపులైన్ మారిస్తే నీళ్లు పుష్కలంగా అందుతాయని.. వెంటనే భగీరథ సంబంధిత అధికారులు స్పందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
పైప్ లైన్ మార్చి మంచినీళ్లు అందివ్వాలని.. లేకుంటే గ్రామ ప్రజలంతా కలిసి భగీరథ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సుధాకర్, మహేష్, నిరంజన్, చంటి, నాగరత్నం, ఎం ఈ ఎఫ్ డివిజన్ ప్రెసిడెంట్ కారంగి నరసింహ పాల్గొన్నారు.
Robbery | బైనపల్లి ఆలయంలో చోరీ.. హుండీ ధ్వంసం చేసి నగదు, ఆభరణాలు అపహరణ
మాధవస్వామి గట్టుపై ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ పాఠశాల.. గురుకుల పాఠశాలల రాష్ట్ర సెక్రటరీ స్థల పరిశీలన