Vaddepalli: మున్సిపాలిటీ కేంద్రమైన వడ్డేపల్లిలో మాధవస్వామి గట్టుపై ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం కోసం మంగళవారం అధికారులు స్థలాన్ని పరిశీలించారు. గురుకుల పాఠశాలల రాష్ట్ర సెక్రటరీ రవి నాయక్ 377 సర్వేనెంబర్ భూమిలో 25 ఎకరాలు విస్తీర్ణంలో నిర్మించనున్న పాఠశాలకు స్థల పరిశీలన చేశారు. సమీపంలో వసతులు రోడ్డు సౌకర్యం బస్సు రైలు తదితర సౌకర్యాలను అడిషనల్ కలెక్టర్ నరసింహారావు తాసిల్దార్ ప్రభాకర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ స్థలానికి దగ్గర్లోనే కస్తూర్బా పాఠశాల, పాలిటెక్నిక్ పాఠశాల, ప్రభుత్వ దవాఖాన, మున్సిపాలిటీ కార్యాలయం, ప్రభుత్వ జడ్పీహెచ్ఎస్ పాఠశాలు ఉన్నాయని అధికారులు ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ ఎల్ ఆర్ ఏ డి రామచందర్, తాసిల్దార్ ప్రభాకర్, Riఆంజనేయులు సర్వేయర్ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.