Gangamma Temple | కొల్లాపూర్, ఫిబ్రవరి 23 : కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం గంగమ్మ తల్లి ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమం ఇవాళ అంగరంగా వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రాంత ప్రజలు పాడి పంటలతో, సుఖ సంతోషాలతో ఎంతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఆలయ కమిటీ సభ్యులు ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ ధ్వజ స్తంభం ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భక్తులు పాల్గొన్నారు.
Group-2 Mains | ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం
Gurukul Entrance Test | హాల్ టికెట్ ఉన్నా.. గురుకుల పరీక్ష రాసేందుకు అనుమతి నిరాకరణ
Woman Suicide | ఏడాది క్రితం ప్రేమ వివాహం.. రామంతపూర్‌లో గృహిణి ఆత్మహత్య