కొల్లాపూర్, జూన్ 17 : విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందిన నరసింహ (52) కుటుంబాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి (Dureddy Raghuvardhan Reddy) పరామర్శించారు. కోడేరు మండల కేంద్రానికి చెందిన నరసింహ సొంత ఊరిలో పనులు లేక జడ్చర్లకు వలస వెళ్లాడు. అక్కడ పని ప్రదేశంలో సోమవారం విద్యుత్ ప్రమాదానికి గురై మరణించాడు. దాంతో, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ దూరెడ్డి రఘు వర్ధన్ రెడ్డి హాస్పిటల్ దగ్గరికి వచ్చి నరసింహ కుటుంబాన్ని పరామర్శించారు.
జడ్చర్లలో పనిచేస్తూ నరసింహ ప్రమాదానికి గురైనందున.. సదరు కంపెనీ యజమాన్యంతో మాట్లాడి కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసే వరకు కుటుంబ సభ్యులకు అంటామని రఘువర్ధన్ రెడ్డి భరోసా కల్పించారు. రఘువర్ధన్ రెడ్డి వెంట కోడేరు మండల కేంద్రానికి చెందిన ఆధి లాలయ్య, ఆధి శరత్ బాబు, మిద్దె నాగేష్ మిద్దె రామ కృష్ణ ఆధి సోమనాథ్ గారు కొమ్ము దానయ్య, యాప లాలు చెట్టు ఈశ్వర్, పాస్టర్ అబ్రహం,ఆధి కిరణ్ , మాడిపండ్ల వెంకట్ స్వామి లిటిల్ సోల్జర్స్ యూత్ సభ్యులు సాయి బాబు లక్ష్మీకాంత్. వై రాముడు కొమ్ము నరేష్ తదితరులు ఉన్నారు.