Kollapur : కొల్లాపూర్ జూన్ 17: దేశంలో నరేంద్ర మోడీ 11 సంవత్సరాలుగా సుపరిపాలనను అందిస్తున్నారని.. ఈ విషయాన్ని బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి విసృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కొల్లాపూర్ ఇన్చార్జి ఎల్లేని సుధాకర్ రావు (E. Sudhakar Rao) అన్నారు. పెద్దకొత్తపల్లి మండలంలో మండల అధ్యక్షులు దేశమోని పరుశరామ్ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం బీజేపీ మండల కార్యాశాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ నాగర్ కర్నూల్ మాజీ జిల్లా అధ్యక్షులు కొల్లాపూర్ నియోజక వర్గ ఇంఛార్జీ సుధాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మొదటగా మండల కార్యవర్గన్ని ఎన్నుకున్నారు. మండల బీజేపీ ప్రధాన కార్యదర్శులుగా గడ్డమీది రాముడు,పిల్లి. నాగరాజులను ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా గుండాల శివ, వినోద్, పూజారి చంద్రశేఖర్ లను కార్యదర్శులుగా గొప్య నాయక్, కల్పన, లక్ష్మి కోశాధికారీగా రేష్మలను ఎన్నుకోవడం జరిగింది. నూతన మండల కార్యవర్గం అనంతరం ఎల్లేని సుధాకర్ రావు మాట్లాడుతూ.. 11 సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోడీ అందిస్తున్న సుపరిపాలనను బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి విసృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, పేద ప్రజల కోసం మోడీ అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
రాబోయే స్థానిక ఎన్నికల్లో పెద్దకొత్తపల్లి మండలంలోని ప్రతి గ్రామంలో బీజేపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, వివిధ మోర్చాల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.