బిజినేపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని మంగనూరు గ్రామంలో ఉరేసుకుని డీసీఎం డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగనూరు గ్రామానికి చెందిన దాసరి చిన్నయ్య (38) ఓ రైస్ మిల్లు ఆవరణలో రెండు డీసీఎంల మధ్యన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించేసరికే అతను ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడు చిన్నయ్యకు భార్య పద్మతో పాటు ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.