SLBC Tunnel Mishap | అచ్చంపేట, మార్చి 16 : దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న మిగిలిన ఏడుగురి ఆచూకీ కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు 23వ రోజుకు చేరుకున్నాయి. మానవ ప్రయత్నం, యంత్రాలతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నా.. ఏడుగురి ఆచూకీ మాత్రం నేటికీ లభ్యం కాలేదు. సహాయక బృందాలు రాత్రింబవళ్లు శ్రమించి కష్టపడుతున్నా లోపల చిక్కుకున్న కార్మికుల ఆడవాళ్లు కనిపించడం లేదు. ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆఫీస్ వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నట్టు.. D1, D2 ప్రదేశాల్లో రెట్టింపు సహాయక బృందాలతో పనులు మరింత వేగవంతం చేసినట్టు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే బృందం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ బృందం, హైడ్రా, ర్యాట్ మైనర్స్ బృంద సభ్యులతో భారీ స్థాయిలో సహాయక చర్యలు కొనసాగిస్తూ, సహాయక బృందాలకు అవసరమైన అన్ని సౌకర్యాలను, పనికి కావలసిన సామాగ్రిని, నిరంతరం అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
నిపుణుల సలహాలు స్వీకరిస్తూ..
సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగే విధంగా సహాయక బృందాలకు పౌష్టికాహారం, తాగునీరు, మరియు మెడికల్ సపోర్ట్, సమయానికి అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించడానికి జరుగుతున్న సహాయక చర్యల్లో దేశంలో గల అన్ని సహాయక బృందాలను సహాయక చర్యల్లో వినియోగిస్తున్నట్లు తెలిపారు. అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతోపాటు, టన్నెల్ ప్రమాదంలో రెస్క్యూ నిర్వహించే నిపుణుల నుంచి సలహాలు సూచనలు స్వీకరిస్తూ, సహాయక చర్యలు జరుగుతున్న విధానాన్ని రోజు సమీక్షించుకుంటూ సహాయక బృందాల మధ్య సమన్వయంతో పని చేసే విధంగా అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో ఆర్మీ,సింగరేణి మైన్స్ రెస్క్యూ టీమ్,NDRF (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్), SDRF (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్),ర్యాట్ మైనర్స్,కడావర్ డాగ్స్, హైడ్రా,అన్వి రోబోటిక్స్,దక్షిణ మధ్య రైల్వే, బృందాల అధికారులు పాల్గొన్నారు.
Harish Rao | నీ దాకా వస్తే కానీ నొప్పి తెల్వదా..? రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించిన హరీశ్‌రావు
Harish Rao | కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్: హరీశ్‌రావు