Congress Leaders | కాంగ్రెస్ నాయకుల పైశాచికత్వం.. కుమ్మెర మల్లన్న జాతర దాడిలో చిన్నారి బలి
Congress Leaders | తక్కువ జాతి వారని బీసీ కుటుంబాన్ని కుమ్మెర మల్లన్న జాతర నిర్వాహకులు గుడిలోకి అనుమతించలేదు. దేవుడి దర్శనం చేసుకోకుండా తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించినందుకు చాకలి చంద్రకళ కుటుంబాన్ని బూతులు తిడుతూ దారుణంగా కొట్టారు.
Congress Leaders | నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర మల్లన్న జాతరలో అమానుష ఘటన చోటుచేసుకుంది. జాతర నిర్వాహకులు సర్పంచ్ సహా తుకారాం రెడ్డి, ఉంద్యాల శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి కన్నిరెడ్డి, కుఫేందర్ రెడ్డి, మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ కుటుంబాన్నిఅడ్డుకొని దాడి చేశారు.
తక్కువ జాతి వారని సదరు బీసీ కుటుంబాన్నినిర్వాహకులు గుడిలోకి అనుమతించలేదు. దేవుడి దర్శనం చేసుకోకుండా తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించినందుకు చాకలి చంద్రకళను, ఆమె కొడుకు గణేష్‌ను, కోడలిని, కూతురిని బూతులు తిడుతూ నిర్వాహకులు దారుణంగా కొట్టారు.
రెండు నెలల చిన్నారి మొహం చూసైనా తమను వదిలేయమని చంద్రకళ కుటుంబసభ్యులు వేడుకున్నా కనికరించకుండా నిర్వాహకులు ఆ చిన్నారిని కాలుతో తన్నారు. ఈ దాడిలో తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది
చంద్రకళ కుటుంబసభ్యులు నిర్వాహకులపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. నాగర్ కర్నూల్ పీఎస్‌లో పోలీసులతిరిగి బాధితులనే బెదిరించడం గమనార్హం. నిర్వాహకులు కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర కుల వ్యక్తులు కావడంతో పోలీసులు తమ ఫిర్యాదు తీసుకోవడం లేదని, తమకు న్యాయం చేసి రక్షణ కల్పించాలని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కుమ్మెర మల్లన్న జాతరలో అమానుషం
కుటుంబంపై దాడి చేసి, రెండు నెలల చిన్నారిని కాలుతో తన్ని ప్రాణాన్ని బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నిర్వాహకులు
బాధితులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే, నిందితులు కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర కుల వ్యక్తులని కంప్లైంట్ తీసుకోని పోలీసులు
తక్కువ… pic.twitter.com/9c1dOb3JtY
— Telugu Scribe (@TeluguScribe) February 21, 2026
కుమ్మెర మల్లన్న జాతరలో అమానుషం
కుటుంబంపై దాడి చేసి, రెండు నెలల చిన్నారిని కాలుతో తన్ని ప్రాణాన్ని బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నిర్వాహకులు
బాధితులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే, నిందితులు కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర కుల వ్యక్తులని కంప్లైంట్ తీసుకోని పోలీసులు
తక్కువ… pic.twitter.com/9c1dOb3JtY
— Telugu Scribe (@TeluguScribe) February 21, 2026
Read Also :
Karthika Deepam | కార్తీక దీపం రెండో సీజన్ 600 ఎపిసోడ్లు పూర్తి.. ప్రత్యేక ప్రోమోతో సంబరాలు
Tirumala | వేసవి సెలవుల్లో తిరుమలకు పెరగనున్న రద్దీ.. వేగంగా దర్శనాలు పూర్తయ్యేలా టీటీడీ ఏర్పాట్లు
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

