కొల్లాపూర్, మార్చి 27: కొల్లాపూర్ నియోజక వర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏ కష్టమొచ్చిన ఆ కష్టంలో వారికి తోడుగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కొల్లాపూర్ నియోజకవర్గంలో పలు కుటుంబాలను ఆయన పరామర్శించారు. బిజ్జ వేణు తండ్రి చిన్న లక్ష్మయ్య మృతి చెందిన విషయం తెలుసుకొని హుటాహుటిన హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ కు వచ్చి చిన్న లక్ష్మయ్య పార్థివ దేహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. వేణును ఓదార్చి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆపదలో ఉంటే పార్టీ అండగా అండగా ఉంటుందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో రాజకీయాలకతీతంగా సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీలు అందజేసిందననారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు పెట్టుకుంటే రిజెక్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఆపద సమయాలలో రాజకీయాలు చూడొద్దని హితవు పలికారు. నియోజవర్గంలోని ప్రజలు ఏ క్షణంలోనైనా అనారోగ్యం బారిన పడిన విషయం తన దృష్టికి వస్తే వెంటనే వారికి మెరుగైన వైద్యం అందించేందుకు సంబంధిత డాక్టర్లతో మాట్లాడడంతో పాటు ఎల్ఓసీలు సీఎంఆర్ఎఫ్ లు అందజేస్తామన్నారు. ఆయన వెంట నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.