AITUC | అచ్చంపేట రూరల్, జూన్ 27 : ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లేష్ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం ఆధ్వర్యంలో అచ్చంపేట ఎంఈఓ ఆఫీసులో ఉన్న స్ట్రాంగ్ టీచర్ రఘుకు మధ్యాహ్న భోజనం వర్కర్స్ యూనియన్ సమ్మె నోటీసు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లేష్ మాట్లాడుతూ.. జులై 9 వ తేదీనాడు జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడానికి మధ్యాహ్న భోజనం వర్కర్స్ కూడా పాల్గొంటున్నారని అన్నారు. దేశంలో బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకున్న 44 చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా మార్చి కార్మికులపై పని భారం మోపిందని అన్నారు.
గతంలో రోజుకు ఒక కార్మికుడు ఎనిమిది గంటలు పని చేస్తే ప్రస్తుతం మోడీ ప్రభుత్వం 12 గంటలు పని చేయాలని లేబర్ కోడులు తెలియజేస్తున్నాయని అన్నారు. ధరలను అదుపు చేయలేక ధరలు పెంచడం వలన కార్మికులపై భారాలు పడుతున్నాయని అన్నారు మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేస్తున్న వర్కర్స్కు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని అన్నారు.
సంవత్సరంలో రెండు జతల కాటన్ బట్టలు ఇవ్వాలని అన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ తాలూకా కార్యదర్శి పెర్ముల గోపాల్ మధ్యాహ్న భోజన కార్మికులు కలమ్మ, రాములమ్మ, అచ్చమ్మ, పార్వతమ్మ, లలిత, అలివేల మాధవి తదితరులు పాల్గొన్నారు.