అచ్చంపేట రూరల్ : రద్దయిన మద్యం దుకాణల కేటాయింపు ప్రక్రియను లక్కీ డ్రా పద్ధతిన పూర్తి పారదర్శకంగా నిర్వహించామని జిల్లా అదనపు కలెక్టర్ దేవసహాయం అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలోని మద్యం దుకాణలను సంబంధించి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి గాయత్రి, జిల్లా అదనపు కలెక్టర్ దేవసహాయం, ఆధ్వర్యంలో రద్దయిన బార్ల కేటాయింపును లాటరీ పద్దతిన కేటాయించారు.
ఈ సందర్భంగా దేవసహాయం మాట్లాడుతూ అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలోని రద్దయిన రెండు మద్యం దుకాణాలకు గాను18 దరఖాస్తులు వచ్చాయి అని తెలిపినారు. బార్ల కేటాయింపు ప్రక్రియ లక్కీ డ్రా పద్ధతిన పూర్తి పారదర్శకంగా నిర్వహించామన్నారు. వనపర్తికి చెందిన రాజేష్ రెడ్డి, హైదరాబాద్కు చెందిన ఆనంద్ రెడ్డి టెండర్లను దక్కించున్నారని అయన తెలిపారు.