DSC Notification | మక్తల్, మార్చి 20: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని గొప్పలు చెప్పడం తప్ప.. జాబ్ క్యాలెండర్ ప్రకారంగా డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని భారత రాష్ట్ర సమితి నాయకులు రుద్ర సముద్రం రామలింగం అన్నారు.
ఇవాళ మక్తల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలల్లో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చడంతోపాటు, రాష్ట్రంలో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంబడే మా ప్రభుత్వమే 50వేల ఉద్యోగాలు ఇచ్చినమని రేవంత్ రెడ్డి అబద్ధపు మాటలు చెప్పుకుంటూ పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు పెట్టి నియామక పత్రాలు మాత్రమే ఇవ్వగలిగారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నోటిఫికేషన్లు విడుదల చేయకుండా ఒక్కసారి 10000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వలేదని పేర్కొన్నారు.
అబద్ధపు మాటలు చెప్పుకుంటూ..
ముఖ్యమంత్రి అన్ని అబద్ధపు మాటలు చెప్పుకుంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు చేతగాని ముఖ్యమంత్రి, గత ప్రభుత్వంలో విడుదల చేసిన నోటిఫికేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందంటూ నిరుద్యోగులను మోసం చేస్తూ అబద్ధపు మాటలు చెప్పే రేవంత్ రెడ్డి ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, అదేవిధంగా విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇస్తామని చెప్పి మోసం చేయడం జరిగిందన్నారు. కాలేజీ విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నప్పటికీ వాటిని విడుదల చేయడంలో ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వహించడం సత్యం కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారంగా మహిళా విద్యార్థినీలకు వెంటనే స్కూటీలను అందించి చేయూత కింద రూ.2500 అందించాలని డిమాండ్ చేశారు.
జోక్ క్యాలెండర్ తయారుచేసి నిరుద్యోగులను నిండా ముంచిండు..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి, జోక్ క్యాలెండర్ తయారుచేసి తెలంగాణలోని నిరుద్యోగులను నిండా ముంచినాడని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 1023 గురుకుల పాఠశాలలో మౌలిక వసతులతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య, పుష్కలమైన ఆహారం అందేదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంబడే గురుకుల పాఠశాలలో ఎంతో మంది విద్యార్థుల ప్రాణాలను కాంగ్రెస్ ప్రభుత్వం బలిగొన్న విషయం వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. గురుకుల పాఠశాలలో మరణించిన ప్రతీ విద్యార్థి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఽ
భవిష్యత్తులో తెలంగాణ భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ దిశా నిర్దేశంలో ప్రయాణిస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో సమస్యల పట్ల విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం నిరంతరం పోరాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మెడలు వంచి అమలు చేయిస్తామని హెచ్చరించారు.
Vishnupriya | బెట్టింగ్ యాప్ కేసు.. విష్ణుప్రియ ఫోన్ని సీజ్ చేసిన పంజాగుట్ట పోలీసులు