Ration Cards | గండీడ్ జులై 9: రేషన్ కార్డుదారులకు మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ తహసీల్దార్ మల్లికార్జున రావు కీలక సూచనలు చేశారు. రేషన్ కార్డుదారులు 15 రోజుల్లో ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. లేదంటే సెప్టెంబర్ కోటా రేషన్ రాదని హెచ్చరించారు.
మండల పరిధిలోని 29 రేషన్ డీలర్లతో తహసీల్దార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు నెలల కిందటే ఈకేవైసీ అప్డేషన్ ప్రొగ్రామ్‌ను ప్రభుత్వం ప్రారంభించిందని.. అయినప్పటికీ మండల పరిధిలో చాలా వరకు ఈకేవైసీ పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఇప్పటివరకు ఈకేవైసీ ఎందుకు పూర్తిచేయలేదని రేషన్ డీలర్లను ఆయన ప్రశ్నించారు. అయితే స్థానికంగా చాలామంది ఉండకపోవడం వల్లనే పెండింగ్‌లో ఉండిపోయిందని డీలర్లు ఈ సందర్భంగా తహసీల్దార్‌కు వివరించారు. దీనికి తహసీల్దార్ స్పందిస్తూ ఈకేవైసీ పూర్తి చేయడంలో రేషన్ డీలర్లు చొరవచూపాలని సూచించారు. వీలైనంత త్వరగా అన్ని గ్రామాల్లో ఈకేవైసీ పూర్తి చేసి ప్రజలకు రేషన్ అందేలా చూడాలన్నారు.