మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ అడుగడుగునా ఎన్నికల కోడ్ ఉల్లంఘిం చి మద్యం, డబ్బులు పంచుతూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసింది. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని కోస్గి మున్సిపాలిటీలో నాలుగో వార్డు అభ్యర్థులను పార్టీలోకి చేర్చుకోవడంతో ఏకపక్షంగా ఓటింగ్ జరుపుకొన్నారు. అయితే విపక్షాల పోలింగ్ ఏజెంట్లను కూడా అనుమతించకుండా భారీ రిగ్గింగ్ పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఇదే మున్సిపాలిటీలోని ఆరో వార్డులో చీకటి ఉండడంతో పోలింగ్ సిబ్బంది సెల్ఫోన్ల్ లైటింగ్ ఆన్‌చేసి ఓటర్లకు బ్యాలెట్ పత్రాలు అందజేయడం కనిపించింది. గుర్తులు సరిగ్గా కనబడకుండా కావాలని ఇలా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి పోలీస్ యంత్రాంగం వత్తాసు పలకడంతో పలుచోట్ల బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో నామినేషన్ల ఉపసంహరణ ముగిశాక ఇచ్చిన గుర్తులు బ్యాలెట్ పేపర్లో వచ్చిన గుర్తులు మారడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లోని 11వ డివిజన్, వడ్డేపల్లిలో బీఆర్ఎస్ నేతలు పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో దొంగ ఓట్లు భారీగా వేస్తున్నట్లు సమాచారం రావడంతో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి హుటాహుటిన అక్కడికి వెళ్లి అడ్డుకున్నారు. కార్పొరేషన్ పరిధిలోని వేపూరి గిరి రాంనగర్లో అధికారం పార్టీ అభ్యర్థి దొంగ ఓట్లు వేయించడానికి ప్రయత్నించగా బీఆర్ఎస్ నేతలు అడ్డుకొని తరిమికొట్టారు. బండమీదిపల్లి డివిజన్లో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. మున్సిపాలిటీలో ఇటు కార్పొరేషన్లో ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ ఎన్నికల నిబంధనలను తుంగలోకి తొక్కింది. మొత్తం పైన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కార్పొరేషన్‌తోపాటు 18 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు ఆయా జిల్లాల అధికార యంత్రం ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్జిలు ఆయా మున్సిపాలిటీలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అడుగడుగునా అధికార పార్టీ అండతో రెచ్చిపోయి..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కార్పొరేషన్‌తోపాటు 18 మున్సిపాలిటీల్లో బుధవారం బందోబస్తు మధ్య పోలింగ్ నిర్వహించారు. ఉదయం 7గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులుదీరగా మధ్యాహ్నం వరకే బోసిపోయాయి. ఇదిలా ఉండగా అధికార పార్టీ అండదండలతో కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. 45 డివిజన్లో గుర్తుల సీరియల్ నెంబర్ మారడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అధికార యంత్రాంగం ఇచ్చిన బ్యాలెట్ నమూనా ఒకలాగా… పోలింగ్ రోజు మరోలాగా ఉండడంతో అభ్యర్థులు.. కొద్దిసేపు పోలింగ్ నిలిపివేయడానికి ప్రయత్నించగా అధికారులు ఒప్పుకోలేదు.
నమూనా బ్యాలెట్లో ముందు ప్రధాన పార్టీల గుర్తులు కేటాయించి ఆ తర్వాత జనసేన, ఇతర పార్టీల గుర్తులు కేటాయించారు.. అయితే పోలింగ్ రోజు అనూహ్యంగా ఇచ్చిన బ్యాలెట్లో మాత్రం జనసేన గుర్తు ఒకటో నెంబర్ రాగా, ప్రధాన పార్టీల అభ్యర్థుల గుర్తులు మారిపోయాయి.. బండమీదపల్లి 11 డివిజన్లో స్వల్ప లాఠీచార్జికి చోటు చేసుకున్నది. ఎనిమిదో డివిజన్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. 11వ డివిజన్లో తెల్లవారుజామున బీఆర్ఎస్ నేతలను అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేశారు.. నాయకులంతా ధర్నా చేస్తామని హెచ్చరించడంతో పోలీసులు వదిలిపెట్టారు.
గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ నేతల టార్గెట్
అయిజ మున్సిపాలిటీ భరత్‌నగర్ కాలనీలో పోలింగ్ స్టేషన్ బూత్ నెంబర్ 16లో విధులు నిర్వర్తిస్తున్న ఒక ఉద్యోగి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంతో అతడిని తొలగించారు. అలంపూర్ మున్సిపల్ పరిధిలో దళితవాడ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన 1, 2, 3 వార్ఢులకు సంబంధించిన పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నది. పోలింగ్ ఏజెంట్‌గా గుర్తింపు కార్డు పొందిన బీఆర్ఎస్ అభ్యర్థి ముజీబ్‌కు కాంగ్రెస్ నేతల మధ్య గొడవ చోటు చేసుకున్నది. పోలింగ్ కేంద్రాల ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను ప్రభావితం చేస్తుండగా అలంపూర్ సీఐ ప్రదీప్ కుమార్ ఇరువర్గాల నచ్చజెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. వడ్డేపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నాయకుడు మహిపాల్‌రెడ్డిని రౌడీషీటర్ పేరుతో ముందస్తు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే విజయుడు జో క్యంతో సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. గద్వా ల మున్సిపాలిటీలో 18, 19 కేంద్రాల వద్ద దొంగ ఓటు వేయడానికి వచ్చిన మహిళను పట్టుకున్నారు.
పోలింగ్ రోజూ డబ్బులు పంపిణీ చేస్తూ..
వనపర్తిలో 33వ వార్డులో మరొక వార్డు చెందిన అభ్యర్థి ఓటు వేయడానికి వచ్చాడని బీఆర్ఎస్- కాంగ్రెస్ వర్గల మధ్య స్వల్ప ఘర్షణ చెలరేగింది. పోలీసులు వారిని చెదరగొట్టారు. 11వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తుంటే పట్టుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి.. అడ్డుకొని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. నాగర్‌కర్నూల్‌లో 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి భర్త తిరుమల్ యాదవ్ డబ్బులు పంపిణీ చేస్త్తున్న వీడియో వైరల్ అయింది. పోలింగ్ కేంద్రం సమీపంలో ఓటర్లకు డబ్బులు పంచడంతో అధికార పార్టీ నాయకులు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
ఓటేసిన మాజీ మంత్రులు..
మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లోని 21వ డివిజన్లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వనపర్తిలోని 23వ వార్డులో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఓటేశారు. మక్తల్ మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. నాగర్ కర్నూల్ 16 వార్డులో మాజీ మ ంత్రి నాగం జనార్దన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కార్పొరేషన్ పరిధిలోని 59వ డివిజన్లో రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ ఓటేశారు.
పోలింగ్ ప్రశాంతం..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కార్పొరేషన్‌తోపాటు 18 మున్సిపాలిటీ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఆయా జిల్లా కలెక్టర్లు ప్రకటించారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ మున్సిపాలిటీల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లోని కంట్రోల్ రూమ్ ద్వారా వెబ్ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర బోయి కార్పొరేషన్‌తో పాటు భూ త్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీల ఎన్నికల సరళిని పరిశీలించారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో కలెక్టర్ బదావత్ సంతోష్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
గద్వాలలో కలెక్టర్ సంతోష్ అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు కంట్రోల్ రూమ్ నుంచి ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. నారాయణపేట క లెక్టర్ సిక్త్తాపట్నాయ క్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించా రు. వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి మున్సిపాలిటీలో సామాన్యుడి లాగా క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ సందర్భంగా ఉమ్మడి జిల్లా అధికార యంత్రం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాటు చేయడంతో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ చెదురు ముదురు ఘ టనలు జరిగిన పోలీసులు సంయమనం పాటించాలని మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి వెల్లడించారు.
కాంగ్రెస్ కార్యకర్తలా మారిన ఎస్సై
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని ఓ ఎస్సై కాంగ్రెస్ కార్యకర్తలాగా మారాడు. బీఆర్ఎస్ నేతలను, పార్టీ అభ్యర్థుల భర్తలను టార్గెట్ చేస్తూ ఎన్నికల సంఘం గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ కూడా కేంద్రాల వద్ద రాకుండా అడ్డుకున్నారు. మరోవైపు పోలింగ్ ప్రక్రియకు అడ్డం పడ్డట్లు కేసులు చేస్తానని బెదిరించాడు. అటుగా వస్తున్న ఓటర్లకు హస్తం గుర్తు చూపుతూ ఓటేయాలని ప్రచారం చేయడం కనిపించింది. దీంతో ఎస్సై ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. ఇదిలా ఉండగా ఇదే ఎస్సై గతం లో అధికార పార్టీ ఎమ్మెల్యేకు అనుకూలంగా ఇసుక ట్రాక్టర్లను దగ్గరుండి నడిపించి కాంగ్రెస్‌కు బలపరిస్తేనే మీ వ్యాపారం సాగిస్తామని చెప్పడం అప్పట్లో సంచలనం కలిగించింది. దీంతో సదరు ఎస్సై ను కొంతకాలం బదిలీ చేశారు మళ్లీ అదే స్థానంలో పోస్టింగ్‌పై వచ్చి మున్సిపల్ ఎ న్నికల్లో అధికార పార్టీకి మద్దతుగా ప్రచారం చేయడం విమర్శలకు తావిస్తోంది.
ఉమ్మడి జిల్లాలో పోలింగ్ పర్సంటేజ్
మహబూబ్‌నగర్ కార్పొరేషన్
మొత్తం ఓట్లు : 1,94,541
పోలైన ఓట్లు: 1,31,765
పర్సంటేజ్: 67.73 శాతం
భూత్పూర్ మున్సిపాలిటీ
మొత్తం ఓట్లు: 12,064
పోలైన ఓట్లు: 10,204
పర్సంటేజ్: 84.58 శాతం
దేవరకద్ర మున్సిపాలిటీ
మొత్తం ఓట్లు: 10,070
పోలైన ఓట్లు 8,611
పర్సంటేజ్: 85.51శాతం
నారాయణపేట మున్సిపాలిటీ
మొత్తం ఓట్లు: 35,460
పోలైన ఓట్లు 26,304
పర్సంటేజ్: 74.18 శాతం
మద్దూరు మున్సిపాలిటీ
మొత్తం ఓట్లు: 12,701
పోలైన ఓట్లు 10,034
పర్సంటేజ్: 79.00 శాతం
కోస్గి మున్సిపాలిటీ
మొత్తం ఓట్లు: 20,248
పోలైన ఓట్లు 15,150
పర్సంటేజ్: 74.82శాతం
మక్తల్ మున్సిపాలిటీ
మొత్తం ఓట్లు: 21,891
పోలైన ఓట్లు 15,369
పర్సంటేజ్: 70.20 శాతం
నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ
మొత్తం ఓట్లు: 35,378
పోలైన ఓట్లు 26,171
పర్సంటేజ్: 73.98 శాతం
కొల్లాపూర్ మున్సిపాలిటీ
మొత్తం ఓట్లు: 19,356
పోలైన ఓట్లు 15,505
పర్సంటేజ్: 80.01 శాతం
కల్వకుర్తి మున్సిపాలిటీ
మొత్తం ఓట్లు: 26.023
పోలైన ఓట్లు 21.027
పర్సంటేజ్: 80.80 శాతం
వనపర్తి మున్సిపాలిటీ
మొత్తం ఓట్లు: 64,182
పోలైన ఓట్లు 45,904
పర్సంటేజ్: 71.51 శాతం
పెబ్బేరు మున్సిపాలిటీ
మొత్తం ఓట్లు: 14,333
పోలైన ఓట్లు 11,912
పర్సంటేజ్: 83.11 శాతం
కొత్తకోట మున్సిపాలిటీ
మొత్తం ఓట్లు: 18,192
పోలైన ఓట్లు 14,319
పర్సంటేజ్: 78.71 శాతం
ఆత్మకూరు మున్సిపాలిటీ
మొత్తం ఓట్లు: 11,579
పోలైన ఓట్లు 8,958
పర్సంటేజ్: 77.36 శాతం
అమరచింత మున్సిపాలిటీ
మొత్తం ఓట్లు: 9,147
పోలైన ఓట్లు 7,645
పర్సంటేజ్: 83.58 శాతం
గద్వాల మున్సిపాలిటీ
మొత్తం ఓట్లు: 65,282
పోలైన ఓట్లు 48,679
పర్సంటేజ్: 74.57 శాతం
అయిజ మున్సిపాలిటీ
మొత్తం ఓట్లు: 23,016
పోలైన ఓట్లు 19,491
పర్సంటేజ్: 84.69 శాతం
అలంపూర్ మున్సిపాలిటీ
మొత్తం ఓట్లు: 8,751
పోలైన ఓట్లు 7,104
పర్సంటేజ్: 81.18 శాతం
శాంతినగర్ మున్సిపాలిటీ
మొత్తం ఓట్లు: 10,604
పోలైన ఓట్లు 8,935
పర్సంటేజ్: 84.26 శాతం