మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనున్నది. వా రంరోజులుగా పట్టణాల్లో హో రాహోరీగా ప్రచారం నిర్వహించిన పార్టీలు చివరిరోజైన సోమవారం అన్నిచోట్ల భారీ రోడ్‌షోలతో ఓటర్లను అకట్టుకోనున్నారు. సా యంత్రం ఐదుగంటలకు ప్రచారానికి తెరపడటంతో ఇక ప్రలోభాల పర్వానికి తెరలేవనున్నది. మరో రెండు రోజుల్లో పోలింగ్ జరుగుతుండడంతో ఈ 48గంటలు అభ్యర్థులకు కీలకంగా మారనున్నాయి. గెలుపోటములు నిర్ణయించే సమయం కావడంతో అభ్యర్థులు అస్త్రశస్ర్తాలను ఉపయోగిస్తున్నారు.
పార్టీ అభ్యర్థుల తరఫున అన్ని పార్టీ ల నేతలు హోరాహోరీ ప్రచారాన్ని చేపట్టాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు తలపించేలా మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈసారి బీఆర్ఎస్ నేత లు ప్రచారంలో దూసుకుపోయారు. మాజీ మంత్రు లు ,ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నేతలు అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపుకోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మ హబూబ్‌నగర్ కార్పొరేషన్‌తోపాటు 18 మున్సిపాలిటీలు మైక్‌లతో హోరెత్తిపోయాయి. ఇక ప్రచారానికి తెరపడడంతో అసలు సిసలైన పర్వం మొదలైం ది..
మున్సిపల్ ఎన్నికలు అధికార పార్టీకి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గెలుపు సునాయాసమని అనుకున్న ఆ పార్టీకి అభ్యర్థులు ముచ్చెమటలు పడుతున్నాయి. చాలాచోట్ల అర్హులకు టికెట్లు ఇవ్వకపోవడంతో నేతలపై దుమ్మెత్తి పోశారు. ఇక గద్వాల్లో టికెట్లలోని తారస్థాయికి చేరింది. ఈ పరిణామాలన్ని కాంగ్రెస్ నేతలకు పెద్ద షాక్‌గా మారాయి . మరోవైపు టికెట్లు రాని వాళ్లంతా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అయితే అలంపూర్ మున్సిపాలిటీలో ఒక వార్డును బీఆర్ఎస్ ఏకగ్రీవం గా గెలుచుకున్నది. ఈ పరిణామంతో ఉమ్మడి జిల్లా లో బీఆర్ఎస్ శ్రేణులు కొత్త ఉత్సాహం నెలకొన్నది.
మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌తో పాటు 18 మున్సిపాలిటీలో గెలుపు కోసం బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. అభ్యర్థుల కోసం గల్లీ గల్లీ తిరుగుతూ ఇంటింటికి వెళ్లి ఓటు వేయాలని నాయకులు అభ్యర్థించారు. ఆయా పార్టీల అభ్యర్థులు వినూత్న రీతి లో ప్రచారం నిర్వహించి ఓటర్లను ఆకట్టుకున్నారు. ఇక బీఆర్ఎస్ నేతలు వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు.
మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్ రెడ్డి, ప ట్నం నరేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జ నార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్ యాదవ్, గద్వాల బీఆర్ఎస్ ఇన్చార్జిలు బాసు హనుమంతు నాయుడు, ఆంజనేయగౌడ్ సమిష్టిగా కృషిచేసి వ్యూ హాత్మకంగా ప్రచారం చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. టికెట్ల కేటాయింపులో కూడా ఎలాంటి గొడవలు జరగకుండా గెలుపు గు ర్రాలకే టికెట్లు ఇచ్చారు. టికెట్లు రాని వాళ్లకు భవిష్యత్‌లో మంచి పదవులు ఇస్తామని అందరినీ ఏకతాటి పైకి తీసుకొచ్చారు. అందరికంటే ముందుగా ప్రచా రం చేపట్టి మున్సిపాలిటీలో దూసుకుపోయారు.
మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోలింగ్‌కు ఇంకా రెండు రోజుల సమయం ఉండగానే ప్రచారం ముగుస్తుండడంతో మైక్‌లు మూగబోనున్నాయి. ప్రచార పర్వానికి తెరపడనుండడంతో ఇటు పోలీస్ అటు అధికార యంత్రాంగం ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేపట్టింది. ఇప్పటికే పోలింగ్ స్టేషన్లను గుర్తించి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఆయా జిల్లా కలెక్టర్లు ఏర్పాటు చేస్తున్నారు.