వెల్దండ, మే 1 : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం మండలకేంద్రంలో రోడ్‌షో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, జెడ్పీటీసీ విజితారెడ్డి పాల్గొనగా జనం భారీగా తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ గురుకులాల కార్యదర్శి ఉన్న సమయంలో ఎంతో మంది పేద, బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశానన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి, బీజేపీ అభ్యర్థి ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. అభ్యర్థుల గత చరిత్ర చూసి ప్రజల ఓట్లు వేయాలని కోరారు. వెల్దండలో ఏకలవ్య గురుకుల, ఎస్సీ బాలికల వసతి గృహం ఏర్పాటుకు తాను ఎంతో కృషి చేశానని గుర్తు చేశారు.
జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్పీని అఖండ మె జార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పుట్టారాంరెడ్డి, మా జీ వైస్ ఎంపీపీ వెంకటయ్యగౌడ్, మధుసూదన్‌రెడ్డి, భాస్కర్‌రావు, యాదగిరి, చంద్రమోహన్‌రెడ్డి, తిర్మల్‌రావు, కొండల్, శేఖర్, శ్రీను, మందిరం మల్లేశ్, ప్రవీణ్, ఎంఎస్‌గౌడ్, లింగం, కార్యకర్తలు, నాయ కులు తదితరులు పాల్గొన్నారు.