గద్వాలటౌన్, జూలై 15 : గద్వాల జిల్లా దవాఖానలో ప్రతిరోజూ 600కు పైగా ఔట్ పేషెంట్లు వస్తుంటారు. అ లాగే దవాఖానలో దాదాపు 280మంది వరకు రోగులు చికిత్స పొందుతున్నారు. తమ జబ్బులు నయం చేసుకునేందుకు వచ్చే రోగులకు సిబ్బంది చీదరింపులతోపాటు సరైన మందులు లేకపోవడం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రైవేట్ వైద్యశాలలో చూపించుకోలేక, స ర్కారు దవాఖానలో సరైన మందులు దొరక్కా నానా అ వస్థలు పడాల్సి వస్తుంది. మంచి మందులు కావాలంటే బయటకి రాసిస్తాం తెచ్చుకోండని వైద్య సిబ్బంది చెబుతున్నారని రోగులు వాపోతున్నారు. ఆ డబ్బులే ఉంటే గవర్నమెంట్‌కు దవాఖానకు ఎందుకొస్తామన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మారితే మంచి వైద్యం లభిస్తుందనుకుంటే ‘కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నా లిక ఊడినైట్లెంది’ అని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. కాగా సీజనల్ వ్యాధులైన డయేరియా, ఇతర అం టు రోగాలకు సంబంధించిన మందుల కొరత ఏమి లేదని, అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు.
నాకు కాళ్లు, చేతులు పనిచేస్తలేవు.. డాక్టర్‌కు చూపిద్దామని వచ్చినా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఓ డాక్టర్ వచ్చి ఏమీ చూడకుండానే కర్నూల్‌కు పొమ్మని చీటీ మీద రాసిచ్చి పోయిండు. కనీసం నొప్పి తగ్గనీకైనా మందులు ఇయ్యండని అడిగినా పట్టించుకుంట లేరు.
అయ్యా పట్టించుకోమ్మని మీరైనా చెప్పండి. మూడు నెలల సంది తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. కట్టు కడుతున్నారు.. పంపిస్తున్నారు. మంచి మందులు ఇ య్యమని అడిగితే కసురుకుంటున్నారు. ఆఖరికి ఈ రో జు నడవలేకపోతున్నా. తోపుడు కుర్చీ ఇయ్యమంటే ఇయ్యలే. గా మూలన ఉంటే మేమే తెచ్చుకుని వస్తు న్నాం. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.