నారాయణపేట రూరల్, నవంబర్ 27 : తప్పుడు వా గ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వా టిని అమలు చేయలేక చతికిలపడిందని ఎమ్మెల్సీ, దీక్షాదివస్ నారాయణపేట జిల్లా ఇన్చార్జి కోటిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కోటిరెడ్డి మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు కేసీఆర్.. 2009 నవంబర్ 29వ తేదీన ‘తెలంగాణ వచ్చుడో.. సచ్చుడో’ అని నినదించి ప్రా ణాలను సైతం లెక్కచేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారన్నారు.
ఆ రోజు తీసుకున్న నిర్ణయమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాది పడిందని, ఇది చరిత్రలో నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేసి రాష్ర్టాన్ని దేశంలోనే అత్యున్నత స్థానంలో నిలిపారన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా గడవకముందే రాష్ర్టాన్ని అధోగతి పాలు చేస్తున్నారన్నారు. హామీలను అమలు చేయలేక పూ ర్తిగా విఫలమైందన్నారు. ఈ నెల 29వ తేదీన జిల్లా కేం ద్రంలో జరిగే దిక్షాదివస్ కార్యక్రమానికి భారీగా తరలివ చ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జె డ్పీ మాజీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖాహన్మిరెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ శాసం రామకృష్ణ, మండలాలు, పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు, మాజీ ఎంపీపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం కావడంతో ప్రతి గ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డిని ప్రజలు దూషిస్తున్నారని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి తెలిపారు. గతంలో జిల్లాకు ఎస్పీ కార్యాలయం మంజూరు చేశామ ని, కానీ అది ఇప్పుడు ఎక్కడ నిర్మిస్తున్నారో కూడా తెలియడం లేదన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడి పనిచేసి బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలన్నారు. రెండు వేల మంది పైచిలుకు కార్యకర్తలతో దీక్షాదివస్ కార్యక్రమాన్ని జిల్లా పార్టీ కార్యాలయంలో చేపడుతున్నామన్నారు. అదేరోజు నర్సిరెడ్డి చౌరస్తా నుంచి జిల్లా పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ ఉంటుందన్నారు. ఉదయం 9:30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.
రాష్ట్రంలో ప్రజాపాలన గాడి తప్పిందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇందుకు మాగనూర్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనే నిదర్శనమన్నారు. వారంలో మూడుసార్లు ఇలా జరిగిందని.. విద్యార్థులతో ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందన్నారు. ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులను పరామర్శించడానికి వెళ్తే బుధవారం తెల్లవారుజామున అక్రమంగా అరెస్ట్ చేసి మద్దూర్‌కు తరలించారన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే తలతిక్కగా మాట్లాడుతున్నాడని, అక్రమ అరెస్ట్‌లకు భయపడేది లేదని, తాను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా మేమంతా అండగా ఉంటామన్నారు.