అలంపూర్ చౌరస్తా, నవంబర్ 16: ఇథనాల్ కంపెనీ ఏర్పాటుతో మా గ్రా మాల్లో పంట పొలాలు బీడుగా మారే అ వకాశం ఉందని, ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడితే రైతన్నలకు వలసలు తప్పవని ఎ మ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడితో రాజోళి మండలానికి చెం దిన రైతులు గోడు వెళ్లగక్కారు. శనివారం రాజోళి మండలానికి చెందిన పలు గ్రా మాల రైతులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేకు ఇథనాల్ కంపెనీ నిర్మాణం నిలిపివేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భం గా రైతులు మాట్లాడుతూ.. రాజోళి మం డలంలో 2009లో వచ్చిన వరదలతో రై తులు, ప్రజలు నష్టాలను చూశామన్నా రు.
ఇప్పడు ఇథనాల్ కంపెనీ నిర్మాణం చేపడితే పెద్దధన్వాడ, చిన్నధన్వాడ, నసనూర్, మాన్దొడ్డి, చిన్న తండ్రపాడు, నౌ రోజి క్యాంపు, వేణిసోంపురం, కేశవరం, తుమ్మిళ్ల, పచ్చర్ల, తనగల, పెద్దతాండ్రపా డు, రాజోళిలో పంటపొలాలు కలుషిత మై బీడుగా మారుతాయని, కలుషితంతో ప్రజలు అనారోగ్యాలబారిన పడుతారని ఆవేదన వ్యక్తం చేశారు. మా గ్రామాల స మస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యా యం చేయాలని ఎమ్మెల్సీ, ఎమ్మెలేను కో రారు. దీంతో ఎమ్మెల్సీ చల్లా, ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ.. సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ల్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. కా ర్యక్రమంలో రాజోళి మండలాల రైతులు పాల్గొన్నారు.