ఊట్కూర్ : పేదలకు కడుపునిండా అన్నం పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి (MLA Vakiti Srihari) అన్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ( Paddy Procure Centre) ప్రారంభించారు. పులి మామిడి, నిడుగుర్తి గ్రామాల్లోని చౌక ధర దుకాణాల్లో సన్న బియ్యం ( Rice) పంపిణీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం కూడా రేషన్ దుకాణాల ( Ration Dealers) ద్వారా పేదలకు సన్న బియ్యం అందించడం లేదన్నారు. ప్రభుత్వం అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఆహార భద్రత కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రభుత్వం వరి ధాన్యానికి క్వింటాలుకు రూ. 2,300 చెల్లించి కొనుగోలు చేస్తుందన్నారు.
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను దళారులకు అమ్మి నష్టపోవద్దని సూచించారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ బాల్ రెడ్డి, తహసీల్దార్ రవి, మాజీ జడ్పీటీసీ సూర్య ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రకాంత్ గౌడ్, మాజీ విండో చైర్మన్ ఎల్కోటి నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ సూరయ్య గౌడ్, ఏవో గణేష్ రెడ్డి, సొసైటీ అధికారులు అనసూయ, హుస్సేన్, మాజీ ఎంపీటీసీ సభ్యులు కృష్ణార్జున్ రెడ్డి, శివరామరాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విగ్నేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.