నారాయణపేట, నవంబర్ 1: బీఆర్ఎస్ ద్వారానే అభివృద్ధ్ది సాధ్యమని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని 12, 13 వార్డుల్లో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె గడపగడపకు వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో చేపట్టిన అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను విరించారు. బీఆర్ఎస్ ద్వారానే అన్ని వర్గాలకు సముచిత స్థానం లభిస్తుందని కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి, కౌన్సిలర్ నారాయణమ్మ, సీనియర్ నాయకులు వెంకట్రాములు, కార్తీక్, కార్యకర్తలు పాల్గొన్నారు.
నారాయణపేట టౌన్, నవంబర్ 1: పట్టణంలో ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. పట్టణంలోని 2, 6, 7, 8, 15, 18 తదితర వార్డుల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను వివరిస్త్తూ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గురులింగం, అమీరుద్దీన్, మార్కెట్ కమిటీ మాజీ వైస్‌చైర్మన్ జగదీశ్, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు శ్రీపాద్, సీనియర్ నాయకులు శివరాంరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, చంద్రశేఖర్, సుభాశ్ తదితరులు పాల్గొన్నారు.
దామరగిద్ద, నవంబర్ 1: నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ బూత్ కమిటీ సభ్యులు అన్నారు. బుధవారం వారు మండంల కేంద్రంతో పాటు విఠలాపూర్, ఉల్లిగుండం, ఎల్సాన్‌పల్లి, ఉడ్మల్గిద్ద, ముస్తాపేట్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఉల్లిగుండం గ్రామంలో ఎంపీటీసీ కిషన్ రావు, విఠలాపూర్‌లో వైస్ ఎంపీపీ దామోదర్‌రెడ్డి అధ్వ ర్యంలో కార్యకర్తలు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరిస్తూ కారుగుర్తుకు ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ధన్వాడ, నవంబర్ 1 : బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగేందుకు కారు గుర్తకు ఓటేసి ఎమ్మెల్యే ఎస్. ఆర్‌రెడ్డిని గెలిపించాలని మాజీ జెడ్పీటీసీ ఎం.వెంకట్‌రెడ్డి కోరారు. బుధవారంకిష్టాపూర్ గ్రామంలో ఆయన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ ఎస్ నాయకులు సునీల్‌రెడ్డి, ఆర్.వెంకట్‌రెడ్డి, గండి బాలరాజు, ఎంపీటీసీ కడపయ్య, నాయకులు బాల య్య, చేన్నకేశవరెడ్డి, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోయిలకొండ, నవంబర్ 1: మండలాన్ని అన్ని రం గాల్లో అభివృద్ధ్ది చేస్తున్న రాజేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు ఖాజీపూర్, పారు పల్లి, ఆచార్యపూర్, ఇబ్రహీంనగర్, అభంగపట్నం, వింజమూరు, నల్లవెల్లి, కొతలాబాద్ తదితర గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధ్ది సాధ్యమని కారుగుర్తుకు ఓటేసి బీఆర్ఎస్కు మరోసారి పట్టం కట్టాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.
మరికల్, నవంబర్ 1: బీఆర్ఎస్ ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకు పోవడం ఖాయమని పెద్దచిం తకుంట సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, తీలేరు సింగిల్ విండో చైర్మన్ రాజేందర్ గౌడ్ అన్నారు. బుధవారం మరికల్ మండలం పెద్దచింతకుంటలో వారు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటు పడుతున్న ఎమ్మెల్యే ఎస్.ఆర్రెడ్డికి ప్రతి పల్లెలో ప్రజలు నీరాజనం పడుతున్నారన్నారు. అలాగే మండల కేంద్రం లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని పార్టీ నాయకులు ప్రారం భించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యుడు మల్లేశ్, నాయకులు అలంపూర్ శ్రీనివాసులు, కార్య కర్తలు తదితరులు పాల్గొన్నారు.