నారాయణపేట/కోయిలకొండ, జూలై 18 : కాంగ్రెస్ హయాంలో లాఠీ దెబ్బలు తింటేనే యూరియా బస్తాలు దొరికేవని పేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి విమర్శించారు. దేశంలో రైతును రాజును చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దకిందన్నారు. వ్యవసాయ రంగానికి మూడుగంటల కరెంట్ చాలన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ, రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట మండలం సింగా రం, కోయిలకొండ మండలం శ్రీరామకొండ రైతువేదికల వద్ద రైతులతో సమావేశమై మాట్లాడారు. రైతుల కోసం గతంలో ఎవరూ మీటింగ్ పెట్టలేదని, పార్టీ కోసం ఎలక్షన్ల కోసం మాత్రమే మీటింగులు పెట్టారన్నారు. ఈ మీటింగ్ రాజకీ య పార్టీకి సంబంధించినది కాదని.. రైతుల బాగోగులు చర్చించుకోవడానికి పెట్టినదని పేర్కొన్నారు. నేడు 24 గంటల కరెంటుతో రాత్రుళ్లు పొలాలకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. ఒక గంట కరెంటుతో ఎకరా పొలాన్ని ఎలా పారిస్తారు? ఏనాడైనా రేవంత్ రెడ్డి వ్యవసాయం చేశాడా? అని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం ప్రతి ఏటా రూ.10,500కోట్లు ఖర్చు చేస్తున్నదన్నారు. అందువల్లనే రాష్ట్రంలో 2కోట్ల 78లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు.
కాంగ్రెస్ హయాంలో పిండిసంచి కోసం చెప్పులు లైన్లో పెట్టేవారని, నేడు లైన్లో నిలబడే అవసరం లేకుండా సరిపడా విత్తనాలు, యూరియా సంచులను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందన్నారు. ఈసారి సీజన్లో వరి సాగులో పంజాబ్‌ను వెనకి నెట్టి తెలంగాణ నంబర్ వన్ స్థానానికి చేరుకుంటుందన్నారు. రైతుబంధు కోసం రూ.73వేల కోట్లు ఖర్చుపెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దకిందన్నారు. తెలంగాణలో లక్షా 64,478 రైతులు మృతి చెందగా నామినీల ఖాతాల్లో ప్రభుత్వం రైతుబీమా కింద రూ. 5,300కోట్లు జమచేసిందన్నారు. ప్రసు త్తం తెలంగాణలో 24గంటల విద్యుత్ అందించడంతో దాదాపు 30లక్షల మోట ర్లు నడుస్తున్నాయని వెల్లడించారు. 2014కు ముందు పేట నియోజకవర్గం లో 18 సబ్స్టేషన్లు ఉంటే.. పదేండ్లల్లో కొత్తగా 21 సబ్స్టేషన్లు ఏర్పా టు చేశామన్నారు. సమావేశంలో ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, మారెట్కమిటీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాములు, సిం గారం సర్పంచ్ జయంతి, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.