మహబూబ్నగర్ : జడ్చర్ల మున్సిపాలిటీలో తొమిదేళ్ల క్రితం జరిగిన అభివృద్ధికి నేడు జరుగుతున్న అభివృద్ధి పనులను బెరీజు వేసుకోవాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రజలను కోరారు. అన్ని వార్డుల్లో 100% సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించేందుకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు. రూ.35.00 లక్షలతో జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో 1వ వార్డులోని క్రిస్టియన్ కాలనీలో సీసీ డ్రైన్, 11వ వార్డులోని బొడ్రాయి వద్ద చేపట్టనున్న సీసీ రోడ్డు, ఎనిమిదో వార్డు హౌసింగ్ బోర్డ్ లో ఉర్దూఘర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ గత 9 ఏళ్లలో పల్లెల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగైందని, మౌలిక వసతులు కూడా పెరిగాయని చెప్పారు. గ్రామపంచాయతీలో మున్సిపాలిటీల్లో నిత్యం చెత్త సేకరణ, డంపింగ్ యార్డ్ ఏర్పాటు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలతో పారిశుద్ధ్యం మెరుగైందన్నారు. అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని, ప్రతి కుటుంబం ఏదో ఒక రూపంలో సర్కార్ నుంచి సంక్షేమ ఫలాలు పొందుతుందన్నారు. ప్రజలు గత 9 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గమనించాలని, పనిచేసే ప్రభుత్వానకి మద్దతు ఇవ్వాలని కోరారు.
,